Wednesday, November 16, 2022

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

 ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా ఈరోజు అనగా 15 11 2022న పుస్తక ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ ఎర్నం చిన్నప్పయ్య ప్రారంభించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ గ్రంథాల పాలకులు శ్రీ సత్యనారాయణ గారు రిటైర్డ్ లైబ్రేరియన్  ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల హనుమకొండ, శ్రీ సంపత్ కుమార్ గారు రిటైర్డ్ లైబ్రేరియన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్,  మరియు సంపత్ కుమార్ గారు హాజరైనారు. విద్యార్థులకు పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను వివరించారు, విద్యార్థి దశ నుండి వివిధ రకాల పుస్తకాలను ఆటోబయోగ్రఫీసును చదవటం అలవాటు చేసుకోవాలని వాటి నుండి స్ఫూర్తి పొంది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడి తమ చదువుకి సంబంధించిన అంశాలలో గ్రంథాలయాలను ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు, తద్వారా సరియైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుందని సూచించారు పుస్తక పఠనం జీవితకాల అధ్యయనానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా రేపు ఎల్లుండి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, వక్తృత్వ పోటీలు నిర్వహించబడినది తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కళాశాల గ్రంథ పాలకులు పి విజయకుమార్, కళాశాల అధ్యాపకులు డాక్టర్ టి అరుణ కుమారి,  కె రాంబాబు, పి శ్రీనివాసరావు,  శ్రీనివాస్, స్వరూప రాణి, కరుణాకర్ గ్రంథాలయ స్టాప్ బి మోహన్ రావు బి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు

 

 

 

        https://jh9news.com/news/details/520


 

 

 

 

Wednesday, November 2, 2022

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచలో జిల్లా షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

       ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచలో 02-11-2022,  డిగ్రీ విద్యార్థులకు షీ టీం బృందం మరియు మహిళా సాధికారత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు డాక్టర్ వై చిన్నప్పయ్య ప్రిన్సిపల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  బి శ్రీనివాసరావు గారు ఏఎస్పీ పాల్వంచ హాజరైనారు, విద్యార్థులు తమ చదువుపై మాత్రమే శ్రద్ధ వహించాలని తమ తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని, సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఆకాంక్షించారు. యువత తప్పుదారులు పట్టవద్దని మహిళలను తమ కుటుంబ సభ్యులుగా భావించి అందరి పట్ల సద్భావనతో ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా షీ టీం ఇన్చార్జి శ్రీమతి రమాదేవి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులతో సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

     విద్యార్థుల యొక్క బాధ్యతను సమాజంలో వారి క్రియాశీల పాత్రను ప్రాధాన్యతను వివరించారు, విద్యార్థులు టెక్నాలజీని తమకు అవసరమైన మేరకు మాత్రమే వాడుకోవాలని మొబైల్ లో వచ్చే అన్ని రకాల వాటికి ప్రతిస్పందించవద్దు అని, సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహిళలకు ఏదైనా సందేహాలు కానీ ఇబ్బంది కానీ ఉన్న తనని 7901145721 కి ఫోన్ చేసి నిసందేహముగా  మాట్లాడవచ్చునని వారి విషయాలు గోప్యంగా ఉంచబడతాయని వివరించారు. తప్పు జరిగినప్పుడు ముందుగానే తన దృష్టికి తీసుకు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ప్రొసీజర్ ద్వారా వారిలోని మార్పుకు కృషి చేస్తామని, అప్పటికి మార్పు రాని వారి విషయంలో చట్టం తన పని చేసుకుంటూ పోతుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనుసరిస్తున్న షీ టీం విధానాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నాయని, మహిళల పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తమ జిల్లాలో తమకు మార్గదర్శకం చేస్తున్న జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాలలోని మహిళ విద్యార్థులు 65 శాతం ఉన్నందున తాము ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తామని తమకు సహకరించిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎర్నం చిన్నప్పయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

     అనంతరం ఏఎస్పీ శ్రీనివాసరావు గారిని, షీ టీం అధికారి రమాదేవి గారిని, అధ్యాపకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ జ అబ్రహం, మహిళా సాధికారికత అధికారిని కే.వనజ, IQAC కోఆర్డినేటర్ ఎస్ రాంబాబు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం పూర్ణచందర్రావు, అధ్యాపకులు P. విజయ్ కుమార్ , డాక్టర్ టి అరుణ కుమారి, కే కార్తీక్, కే రాంబాబు, పి శ్రీనివాసరావు , పి శ్రీనివాస్, ఎన్ శ్రీదేవి, ఎస్ స్వరూప రాణి, ఎస్ విమల తదితరులు పాల్గొన్నారు.