పాల్వంచ : డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జాతీయ సేవా పథకం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ యూనిట్ ఆధ్వర్యంలో ఈరోజు ఎయిడ్స్ ర్యాలీని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎర్నం చిన్నప్పయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారిపట్ల ప్రేమతో సానుభూతి తో వ్యవహరించాలని ఇది అంటూ వ్యాధి కాదు అని అవగాహన కలిగి ఉండాలని సూచించారు గత 30 సంవత్సరాలుగా జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రభుత్వము వారు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాధి పట్ల అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ప్రత్యేక విభాగాలను కేటాయించడం జరిగిందని సూచించారు యువత సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తద్వారా సంక్రమించే అనేక వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉన్నదని సూచించారు ప్రతి ఒక్కరు ఈ వ్యాధి పట్ల మిగతా వారికి అవగాహన కల్పించాలని సూచించారు రక్తమార్పిడి సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు అనంతరం విద్యార్థులు అధ్యాపకులు పాల్వంచ కళాశాల నుండి ఇందిరానగర్ కాలనీ వరకు ర్యాలీని నిర్వహిస్తూ అవగాహన స్లొగన్స్ ఇచ్చారు ఈ ర్యాలీలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ జే అబ్రహం కళాశాల అధ్యాపకులు డాక్టర్ పి విజయ్ కుమార్ కళాశాల హెల్త్ క్లబ్ ఇన్చార్జి శ్రీమతి ఎన్ శ్రీదేవి అధ్యాపకులు శ్రీ లీల సౌమ్య, విజయ జోషి, భాస్కర్ రావు, హారిక, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
|
|
|