Friday, December 10, 2021

"గొప్ప లక్ష్యాలను ఎంచుకొని కష్టపడితే విజయాలు మీ సొంతం" కెరీర్ గైడెన్స్ అవగాహనా సదస్సులో -- ఇండియన్ రెవిన్యు సర్విసెస్ అధికారి నర్సింహారెడ్డి IRS.

 Sadhu Narsinghareddy, Officer, Indian Revenue Services, said, "Success will come to you if students work hard to achieve lofty goals." Bhadradri Kottagudem District Palvancha Government Degree College today conducted an awareness seminar for students on Civil Services Examinations under the auspices of the Career Guidance Cell under the chairmanship of Dr. Chinnappaiah, Principal of the college. IRS Officer Sadhu Narshima Reddy, who was the keynote speaker at the event, said that Indian Civil Services is one of the top ten most difficult exams in the world and students should not be afraid to achieve it. PPT and video explained the biographies of civil service officers who achieved that mother tongue was not a barrier in India and that mental and physical disability and poverty were not prevented. Bhadradri told reporters that as Kottagudem district is a purely tribal district, he often conducts such programs to allay misconceptions and suspicions about civil services among students studying in government colleges. The event was attended by Telangana Gazetted Officers District President Sangam Venkata Pullaya, Career Guidance Cell in-charge Surampally Rambabu, Academic Coordinator Vijay Kumar, Senior Faculty members Abraham, IQUS Coordinator Poornachandra Rao and faculty members.

(విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడితే విజయాలు మీ తలుపుతడతాయని ఇండియన్ రెవిన్యు సర్విసెస్ అధికారి సాధు నర్సింహారెడ్డి వెల్లడించారు. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సివిల్ సర్వీసెస్ పరిక్షల పై కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహాన సదస్సు ను కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్ చిన్నన్నయ్య అద్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐ.ఆర్.యస్.అధికారి నర్సింహారెడ్డీ ప్రధాన వక్తగా హాజరై మాట్లాడుతూ,  ప్రపంచంలో పది ప్రధాన అతి కష్టమైన పరిక్షల ల్లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఒకటని దీనిని సాధించుట లో విద్యార్ధులు భయపడవద్దని సూచించారు. భారతదేశంలో మాత్రు భాషలు  అడ్డంకి కాదని, మానసిక, శారీరిక అంగవైకల్యం, పేదరికం అడ్డుకాదని సివిల్ సర్వీసెస్ సాధించిన అధికారుల జీవిత చరిత్రలను ఉదాహారణ లతో సహా పీ.పీ.టీ.మరియు వీడియో రూపంలో వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తీగా గిరిజన జిల్లా అయినందున ప్రభుత్వ కళాశాలలో విధ్యనభ్యసిస్తున్న విద్యార్ధులకు సివిల్ సర్వీసెస్ పై అపోహలు, అనుమానాలను నివ్రుత్తి చేయుటకు తరుచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని విలేఖర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షులు సంగం వెంకట పుల్లయ్య , కెరీర్ గైడెన్స్ సెల్ ఇంఛార్జి సూరంపల్లి రాంబాబు, అకడమిక్ కో ఆర్డినేటర్ విజయ్ కుమార్, సీనియర్ అధ్యాపకులు అబ్రాహమ్, ఐక్యుఏయస్ కో ఆర్డినేటర్ పూర్ణచందర్ రావు,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.) 


 


 

 

 

 

 

 


 

 

 

 






 

No comments:

Post a Comment