Scroll
Friday, February 25, 2022
Tuesday, February 22, 2022
Two-days National Seminar on "Tribal Status in India" at Government Degree College Paloncha will be held in the fourth week of March 2022
Principal Dr. Y Chinnappayya informed that a two-day National Seminar on Government Degree College Palvancha Tribal Status in India will be held in the fourth week of March 2022. The brochure for the National Conference was released today by Mr. Durishetti Anudeep IAS District Collector and Magistrate. The National Conference will be organized by the Department of Economics. The conference is being organized by the Rashtriya Uttara Shiksha Abhiyan (RUSA) courtesy of the college's Higher Education Commissioner Naveen Mittal as the chief guest. The event was attended by Ace Ashok Chakraborty DRO, Head of Department of Economics Dr. Venkateshwarlu, IQAC Coordinator Dr. M Poornachandra Rao, RUSA Coordinator P Vijay Kumar and K Karthik.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ ట్రైబల్ స్టేటస్ ఇన్ ఇండియా అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మార్చి 2022 నాలుగో వారంలో జరుగుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ వై చిన్నప్పయ్య తెలియజేశారు, జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను ఈరోజు శ్రీ దూరిశెట్టి అనుదీప్ ఐఏఎస్ గారు జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ గారు విడుదల చేశారు ఈ జాతీయ సదస్సును డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆర్గనైజ్ చేస్తుందని ఈ సదస్సును రాష్ట్రీయ ఉచత్తర శిక్ష అభియాన్ (RUSA) వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ఉన్నత విద్య కమిషనర్ శ్రీ నవీన్ మిట్టల్ గారు హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏస్ అశోక్ చక్రవర్తి గారు DRO, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అధిపతి డాక్టర్ వెంకటేశ్వర్లు గారు IQAC కోర్డినేటర్ డాక్టర్ ఎం పూర్ణచంద్ర రావు గారు, RUSA కోఆర్డినేటర్ పి విజయ్ కుమార్ గారు, కె కార్తీక్ గారు పాల్గొన్నారు
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ లో 21-02-2022
ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ లో
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21 నీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ లో ప్రిన్సిపల్ డాక్టర్ వై చిన్న పయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ వై చిన్నప్పయ్య మాట్లాడుతూ, మాతృభాష గొప్పదనాన్ని వివరిస్తూ, మాతృభాష కన్ను వంటిదని పరాయి భాష కళ్ళజోడు వంటిదని మాతృభాషలోనే భావవ్యక్తీకరణ స్పష్టంగా ఉంటుందని మాతృభాష పరిరక్షణ కోసం భారతదేశంలో అనేక ఉద్యమాలు జరిగాయని, భాష సంస్కృతికి మూలాధారం అని మాతృభాష ద్వారానే మన సంస్కృతి కూడా ముడిపడి ఉన్నదని సూచించారు. ప్రపంచంలో అనేక లక్షల భాషలు ఉన్నాయని వాటిలో చాలా వరకు లిపి లేదు అని ఆరు వేల పై చిలుకు భాషలకు లిపి ఉన్నదని భాష పరిరక్షణ బడాలంటే ఆ భాషకు సంబంధించిన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలంటే దానిని లిఖించబడలని సూచించారు. అనేక భాషలకు లిపి తయారుచేసే క్రమములో ఉన్నాయని లిపి భాషకు ఆత్మ వంటిదని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధిపతి కె కార్తీక్ మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని యునెస్కో ఫిబ్రవరి 21న గుర్తింపు ఇచ్చిందని దీనికి మన దేశంలోని బెంగాలీ ఉద్యమాన్ని గుర్తు చేశారు. తెలుగు భాష పరిరక్షణ కోసం కృషిచేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, కాళోజీ నారాయణరావు గారు మొదలైన వారు తెలుగు భాషకు చేసిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కోయ, గోరుమాటి, ఉర్దూ, తెలుగు వారి మాతృభాషలో మాతృభాషా దినోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో IQAC ఆర్డినేటర్ డాక్టర్ ఎం పూర్ణచంద్ర రావు గారు, అధ్యాపకులు అబ్రహం గారు, వెంకటేశ్వర్లు గారు, హిందీ శాఖాధిపతి డాక్టర్ టి అరుణ కుమారి గారు, ఇంగ్లీష్ శాఖ అధిపతి సి లీలా సౌమ్య గారు, పి విజయ్ కుమార్ గారు శ్రీమతి స్వరూప రాణి గారు, డాక్టర్ భద్రయ్య గారు, కె రాంబాబు గారు, పి శ్రీనివాసరావు గారు తదితరులు పాల్గొన్నారు
|
|
|
|
|
|
|
|
|
|