ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ లో
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21 నీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ లో ప్రిన్సిపల్ డాక్టర్ వై చిన్న పయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ వై చిన్నప్పయ్య మాట్లాడుతూ, మాతృభాష గొప్పదనాన్ని వివరిస్తూ, మాతృభాష కన్ను వంటిదని పరాయి భాష కళ్ళజోడు వంటిదని మాతృభాషలోనే భావవ్యక్తీకరణ స్పష్టంగా ఉంటుందని మాతృభాష పరిరక్షణ కోసం భారతదేశంలో అనేక ఉద్యమాలు జరిగాయని, భాష సంస్కృతికి మూలాధారం అని మాతృభాష ద్వారానే మన సంస్కృతి కూడా ముడిపడి ఉన్నదని సూచించారు. ప్రపంచంలో అనేక లక్షల భాషలు ఉన్నాయని వాటిలో చాలా వరకు లిపి లేదు అని ఆరు వేల పై చిలుకు భాషలకు లిపి ఉన్నదని భాష పరిరక్షణ బడాలంటే ఆ భాషకు సంబంధించిన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలంటే దానిని లిఖించబడలని సూచించారు. అనేక భాషలకు లిపి తయారుచేసే క్రమములో ఉన్నాయని లిపి భాషకు ఆత్మ వంటిదని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధిపతి కె కార్తీక్ మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని యునెస్కో ఫిబ్రవరి 21న గుర్తింపు ఇచ్చిందని దీనికి మన దేశంలోని బెంగాలీ ఉద్యమాన్ని గుర్తు చేశారు. తెలుగు భాష పరిరక్షణ కోసం కృషిచేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, కాళోజీ నారాయణరావు గారు మొదలైన వారు తెలుగు భాషకు చేసిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కోయ, గోరుమాటి, ఉర్దూ, తెలుగు వారి మాతృభాషలో మాతృభాషా దినోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో IQAC ఆర్డినేటర్ డాక్టర్ ఎం పూర్ణచంద్ర రావు గారు, అధ్యాపకులు అబ్రహం గారు, వెంకటేశ్వర్లు గారు, హిందీ శాఖాధిపతి డాక్టర్ టి అరుణ కుమారి గారు, ఇంగ్లీష్ శాఖ అధిపతి సి లీలా సౌమ్య గారు, పి విజయ్ కుమార్ గారు శ్రీమతి స్వరూప రాణి గారు, డాక్టర్ భద్రయ్య గారు, కె రాంబాబు గారు, పి శ్రీనివాసరావు గారు తదితరులు పాల్గొన్నారు
|
|
|
|
|
|
|
|
|
|
No comments:
Post a Comment