ప్రభుత్వ డిగ్రీ మరియు pg కళాశాల లో రెండు రోజుల జాతీయ సదస్సు ట్రైబల్ స్టేటస్ ఇన్ ఇండియా అనే అంశంపై ప్రిన్సిపల్ డాక్టర్ వై చిన్నపయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఫైనాన్స్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ బలరాం గారు హాజరయ్యారు ఈ జాతీయ సదస్సుకు తెలుగు రాష్ట్రాల లో వివిధ ప్రాంతాల నుండి 118 పరిశోధనా పత్రాలతో కూడిన సావనీర్ నీ విడుదల చేయడం జరిగింది పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ ప్రారంభము నుండి జాతీయ సదస్సు ని నిర్వహించడం ఈ ప్రాంతం లో అత్యధికంగా నివసిస్తున్న గిరిజనుల స్థితిగతులపై నిర్వహించే మొట్టమొదటి జాతీయ సెమినార్ అని తెలియజేశారు ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో పరిశోధన సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం ప్రొఫెసర్ ఏం ప్రసాద రావు గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ గారు ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమాల్లో శ్రీ N. బలరాం గారు మాట్లాడుతూ మొత్తం జనాభాలో గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో గిరిజనుల స్థితిగతుల గురించి జాతీయస్థాయి సెమినార్ను నిర్వహించడం సంతోషకరం గిరిజనులు విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో సుదూర ప్రాంతాలలో జీవనానికి అలవాటు పడ్డారు వారిని జన జీవన స్రవంతిలోకి తేవటం ఎంత ముఖ్యమో వారి స్వేచ్ఛ అస్తిత్వం కాపాడటం అంతే ముఖ్యం దేశ జనాభాలో 8.6% రాష్ట్ర జనాభాలో 9.3 శాతం ఉన్న గిరిజనుల సమస్యలు అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిని వారి జీవన విధానాలను అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా గిరిజనులు విద్య వైద్యం తాగునీరు పారిశుద్ధ్యం తదితర అంశాలను ఎందుకు వెనుకబడి ఉన్నారు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి వారిలో నమ్మకం కలిగించేలా ప్రభుత్వ వ్యవస్థలు పని చేయాలి దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వల్ల నిర్వాసితులు అవుతున్న వారిలో 40 శాతం గిరిజనులే వివిధ సంఘర్షణల కారణంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే గిరిజనుల కు గుర్తింపు లేకుండా పోయింది ప్రభుత్వ పథకాలు వారికి చేరేలా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో ప్రభుత్వానికి ఈ సెమినార్ మార్గదర్శనం చేస్తుందని ఆశిద్దాం అని వివరించారు ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో పెరిగే ఔషధ మొక్కలు ఎగ్జిబిషన్ ని బలరాం నాయక్ గారు ప్రారంభించారు సుమారు 400 రకాల ఔషధ మొక్కల ఎగ్జిబిషన్ ప్రకృతి ప్రేమికులు శ్రీ మొక్కల వెంకటయ్య గారు శ్రీ రాజశేఖర్ గారు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా రిటైర్డ్ రీజినల్ డైరెక్టర్ కమిషనరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ బి దర్జన్ గారు ప్రభుత్వ డిగ్రీ మహిళ కళాశాల ఖమ్మం ప్రిన్సిపల్ డాక్టర్ జి పద్మావతి గారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొత్తగూడెం ప్రిన్సిపాల్ డాక్టర్ కె హవీలా గారు కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఆర్ సీతారామ రావు గారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరిచార్యులు తెలంగాణ యూనివర్సిటీ హెడ్ చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డాక్టర్ రాంబాబు గారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం ప్రిన్సిపాల్ డి భద్రయ్య గారు రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ బత్తుల కృష్ణయ్య గారు డాక్టర్ ప్రసన్న కుమార్ గారు డాక్టర్ బి చంద్రమౌళి గారు అధ్యాపకులు జె అబ్రహం గారు ఎస్ రాంబాబు గారు పి విజయ్ కుమార్ గారు డాక్టర్ అరుణ్ కుమార్ గారు డాక్టర్ పూర్ణచంద్ర గారు వనజగారు కే కార్తీక్ గారు వివిధ కళాశాలలో అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్స్ తదితరులు పాల్గొన్నారు
|
|
|
|
No comments:
Post a Comment