22-02-23: ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ లో ఐసిటి టూల్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కోర్సును డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వై చిన్నప్పయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రస్తుత విద్య వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టూల్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సర్టిఫికెట్ కోర్స్ లో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ పై పూర్తి పరిజ్ఞానాన్ని మరియు గూగుల్ టూల్స్ ను ఉపయోగించి ఉన్నత విద్యలో ఏ విధంగా రాణించవచ్చు వివరిస్తారు. వీడియో మేకింగ్ గూగుల్ క్లాసు రూమ్స్ ఆన్లైన్ క్లాసెస్ వెబ్సైట్ డిజైనింగ్ పోస్టర్ మేకింగ్ న్యూస్ లెటర్ తయారీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొదలైన అంశాలను ఈ సర్టిఫికెట్ కోర్సులో విద్యార్థులకు నేర్పిస్తారు. దీని కోఆర్డినేటర్ పి విజయ్ కుమార్ మాట్లాడుతూ 45 రోజుల ఈ సర్టిఫికెట్ కోర్సును 30 మందికి నేర్పించడం జరుగుతుందని, దీని ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ పై పూర్తి పరిజ్ఞానం వివరించడం జరుగుతుందని సూచించారు. కళాశాలలోని అధునాతన కంప్యూటర్ ల్యాబ్ లో నిర్వహించబడునని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్టిఫికెట్ కోర్స్ మెంబర్స్ సూరంపల్లి రాంబాబు, కే రాంబాబు, ఎస్ విమల, కే దీపిక ,కళాశాల IQAC కోఆర్డినేటర్ పూర్ణచందర్, కుక్కల కార్తీక్, డాక్టర్ ఏ వెంకటేశ్వర్లు పి శ్రీనివాసరావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
|
|
|
|
|
|