తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21 2023న ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వై చిన్నప్పయ్య అధ్యక్షతన తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెలుగు శాఖ విభాగ అధిపతి కుక్కల కార్తీక్ మాట్లాడుతూ అంతరించిపోతున్న మాతృభాషలని పరిరక్షించాలని ముఖ్యంగా గిరిజన ప్రాంతవాసుల భాషలకు లిపి ఏర్పాటు చేసి ప్రాథమిక విద్య నుండి విద్య నుండి మాతృభాషలోనే విద్య బోధన జరగాలని సూచించారు విద్యార్థులకు అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా మిగతా భాషలను నేర్చుకున్న మాతృభాష యొక్క మనుగడను కాపాడుకోవాలని సూచించారు ప్రతి ఇంటిలోని మాతృభాషలో మాట్లాడడం ద్వారా వాటి మనుగడను కాపాడిన వారు అవుతామని వివరించారు ప్రపంచంలోని 7వేలకు పైగా వివిధ భాషలు ఉన్నాయని ప్రస్తుతం వాటి మొనగాడు ప్రశ్నార్థకరంలో ఉన్నాయని సూచించారు కావున మాతృభాష యొక్క అవసరాన్ని ఆవశ్యకతను క్షుణ్ణంగా వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఐక్య సి కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు సీనియర్ధ్యాపకులు డాక్టర్ ఏ వెంకటేశ్వర్లు తెలుగు ఉపన్యాసకురాలు డాక్టర్ శెట్టి స్వరూపారాణి హిందీ విభాగ అధిపతి డాక్టర్ టి అరుణ కుమారి ఆంగ్ల విభాగాధిపతి శ్రీ లీల సౌమ్య అధ్యాపకులు సూరంపల్లి రాంబాబు శ్రీమతి వనజ పి విజయ్ కుమార్ కే రాంబాబు పి శ్రీనివాసరావు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం మాతృభాషలో విద్యార్థుల ఆలపించిన జానపద గేయాలు అందర్నీ ఆకట్టుకున్నాయి
Scroll
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment