Tuesday, September 5, 2023

  పాల్వంచ: 4-9-2023 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రకటించే రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచలో పనిచేస్తున్న డాక్టర్ టి అరుణకుమారి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిందీ, డాక్టర్ ఎం పూర్ణచంద్రరావు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బోటనీ, ఎంపికైనట్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వై చిన్నప్పయ్య తెలియజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచకు జాతీయ స్థాయిలో ఏ గ్రేడు సాధించడంలో మరియు విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దటంలోని వీరి సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికయ్యారని సూచించారు. కళాశాల స్వయం ప్రతిపత్తి హోదాకు అర్హత సాధించిందని దీనిలో విశేష కృషి చేసిన వారికి ప్రిన్సిపల్ శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల విద్యా నుండి కాకతీయ విశ్వవిద్యాల పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచకు రెండు అవార్డులు రావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు ఆధ్యాపాకేతర సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు  


 

 

 

 

 

 

 

 

తెలుగు భాషా దినోత్సవం : 29-08-2023

   ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జే అబ్రహం గారి అధ్యక్షతన తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి పూలమాలతో అలంకరించి నివాళి తెలియజేశారు శ్రీ వెంకట రామ్మూర్తి గారు తెలుగు భాష అభివృద్ధికి చేసిన కృషిని తెలుగు శాఖ విభాగధిపతి కార్తీక్ కుక్కల వివరించారు. గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 1863 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడని తెలుగు వాడిగా గర్వించాలని తెలుగులోనే సంబోధించాలని సూచించారు. తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ ఎస్ స్వరూప రాణి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి గారు యొక్క జీవిత చరిత్రను భాషా పరిరక్షణకు వారు చేసిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు