Tuesday, September 5, 2023

తెలుగు భాషా దినోత్సవం : 29-08-2023

   ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జే అబ్రహం గారి అధ్యక్షతన తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి పూలమాలతో అలంకరించి నివాళి తెలియజేశారు శ్రీ వెంకట రామ్మూర్తి గారు తెలుగు భాష అభివృద్ధికి చేసిన కృషిని తెలుగు శాఖ విభాగధిపతి కార్తీక్ కుక్కల వివరించారు. గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 1863 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడని తెలుగు వాడిగా గర్వించాలని తెలుగులోనే సంబోధించాలని సూచించారు. తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ ఎస్ స్వరూప రాణి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి గారు యొక్క జీవిత చరిత్రను భాషా పరిరక్షణకు వారు చేసిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు

 




No comments:

Post a Comment